దక్షిణ కాశి గా పేరొందిన శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయంలో గురువారం సెలవు దినం కావడంతో దేవాదాయ ప్రాంగణం అంతటా భక్తులతో కిటకిట లాడింది. సుమారు 46 వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు అని ఆలయ అధికారుల తెలిపారు. ఉదయం నుంచి ధర్మగుండంలో స్నానమాచరించి కోడె మొక్కులు సమర్పించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.