మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి వ్యాఖ్యలను తప్పు పట్టిన ఐజీ

60చూసినవారు
మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి వ్యాఖ్యలను తప్పు పట్టిన ఐజీ
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి బుధవారం చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఐజీ సత్య నారాయణ తప్పుబట్టారు. 'ఆయనపై నమోదైన కేసు ఆక్రమమని నరేందర్ రెడ్డి ప్రెస్‌మీట్‌లో చెప్పాడు. అది తప్పు.. విచారణ అనంతరం అన్ని ఆధారాలతోనే కేసు నమోదు చేశాం. నరేందర్ రెడ్డి, సురేష్‌లు దాడి చేయాలని పథకం పన్నారు. సురేష్ అనుచరులు రాళ్ళు కర్రలతో కలెక్టర్, అధికారులపై దాడి చేశారు. కోర్టులో విచారణ‌లో ఉన్న కేసుపై నరేందర్ రెడ్డి మాట్లాడటం తగదు' అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్