చిన్నారుల ఆనందహోళి..!

13614చూసినవారు
రంగుల కేళి హోలీ పండుగను ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు సోమవారం ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలో ఎక్కడ చూసినా హోలీ పండగ సందర్భంగా సందడి వాతావరణం నెలకొంది. యువకుల కేరింతలు, చిన్నారుల అల్లరి చేష్టలు, పెద్దలు ఒకరికొకరు రంగులు పూసుకునే సన్నివేశాలు ఎక్కడ చూసినా దర్శనమిచాయి. చిన్నారులు పిచికారీలతో ఒకరిపై ఒకరు రంగులను చల్లుకుంటూ సందడి చేశారు. ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్