పండగ పూట విషాదం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న ప్రముఖ దేవస్థానం మహాకాళేశ్వర ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
హోలీ పండుగ సందర్భంగా మహాకాళేశ్వరుడికి భస్మహారితి ఇస్తుండగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పూజారులతో సహా 13 మందికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.