రామగుండం: ఆసుపత్రి రెనోవేషన్ పనులను వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్
రామగుండం జనరల్ ఆస్పత్రిలో చేపట్టిన రెనోవేషన్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శనివారం రామగుండం జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ హెచ్ఓడి డాక్టర్ అరుణ, ఆర్ఎంఓ అప్పారావు పాల్గొన్నారు.