వైభవోపేతంగా కామాక్షి దేవి కల్యాణోత్సవం

1140చూసినవారు
రామగుండం కార్పొరేషన్ పరిధి 9వ డివిజన్ జనగామ గ్రామంలోని అతి పురాతన శ్రీ కామాక్షి దేవి ఆలయంలో కామాక్షి, ఏకామేరేశ్వర స్వాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఏలేశ్వరం వీరయ్య చార్యులు ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం, లలితా సహస్ర పారాయణం, హోమాలు, పూర్ణాహుతి, తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామగుండం ట్రాఫిక్ సిఐ కొండపాక ప్రవీణ్, కార్పోరేటర్ జనగామ కవిత సరోజిని హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు..
ఇంకా ఈ కార్యక్రమంలో జనగామ గ్రామ ప్రజలు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్