ఎంపీడీఓపై గృహహింస కేసు నమోదు

1513చూసినవారు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎంపీడీవోపై గృహహింస కేసు నమోదు కావడం సోమవారం కలకలం రేపింది. సిర్పూర్ టి మండలం ఎంపీడీవో జగదీష్ అనిల్ కుమార్ పై భార్య మేరీ కుమారి కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగజ్ నగర్ ఎస్.ఎచ్.ఓ మోహన్ కథనం ప్రకారం ఎంపీడీవో జగదీష్ అనిల్ కుమార్ పై భార్య మేరీ కుమారి ఆదివారం సాయంత్రం.. అదనపు కట్నం తేవాలంటూ శారీరకంగా తనను హింసిస్తున్నాడు అని ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఈ మేరకు జగదీష్ అనిల్ కుమార్ పై గృహహింస, వరకట్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. బాధితురాలు మేరీ కుమారి సోమవారం జిల్లా కలెక్టర్ కలిసి ఎంపీడీఓపై చర్యలు తీసుకోగలరని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్