ఇందిరా మహిళా శక్తి కింద పాడి గేదేల యూనిట్ల ఎంపిక తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. యూనిట్ల, లబ్ధిదారుల ఎంపిక, రుణాల ప్రక్రియ అంశాలపై సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా సమాఖ్య భవనంలో డి ఆర్ డి ఓ శేషాద్రి ముఖ్యఅతిథిగా హాజరుకాగా, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సరిత అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముర్రా జాతి గేదెల ఎంపిక, భీమా, తదితర అంశాలపై వివరించారు.