ఇల్లంతకుంట మండలంలోని పత్తికుంటపల్లి గ్రామానికి చెందిన బోడ రాజిరెడ్డి (40) అనే రైతు తన వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదని, వ్యవసాయ భూమి వద్ద ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు భార్యకు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని ఎస్సై శ్రీకాంత్ గౌడ్ పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.