సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన దీక్ష 29వ సోమవారం కొనసాగింది. దీక్షకు సోమవారం ఎస్ఎఫ్ఐ నేతలు సంఘీభావం తెలిపి, వారి ఆధ్వర్యంలో సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. అనంతరం ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ కు ప్రభుత్వం న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రశాంత్, సమగ్ర శిక్ష జాక్ అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.