విలీన గ్రామాల ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారని బీజేపీ యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు అనిల్ కుమార్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాలను సిరిసిల్లలో విలీనం చేయక ముందు ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ విలీనమయ్యాక చాలా అభివృద్ధి చేస్తామని, ఇప్పుడు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని ఆయన మండిపడ్డారు.