ఎల్లారెడ్డిపేట్ మండలం వెంకటాపుర్ , గంభీరావుపేట సముద్రాలలింగపూర్, గోరంటలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం సందర్శించి అధికారులను కొనుగోలు ప్రక్రియను గురించి అడిగి తెలుసుకున్నా జిల్లా ఎస్పీ. కష్టపడి పండించిన ధాన్యాన్ని మాయమాటలు చెప్పే దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు. దాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.