సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వీధి కుక్కల బెడద చాలా అధికమైంది. వీధి కుక్కలు రోడ్ల మీద పదుల సంఖ్యలో సంచరిస్తు వాహనదారులకు, చిన్నపిల్లలపై దాడి చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. యాంటీ రేబిస్ ఇంజక్షన్ ఇవ్వకపోవడం, కుక్కల సంతానాన్ని నియంత్రణ చర్యలు తీసుకోకపోవడం. వీధి కుక్కల బెడద అధికమవుతుందన్నారు. సంబంధిత అధికారులు వీధి కుక్కలను దూరప్రాంతాలకు తరలించాలని స్థానికులు శుక్రవారం కోరారు.