గంగారం గ్రామంలో మహా కుంకుమార్చన పూజల అనంతరం అన్నదానం
శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలోని శ్రీ గరుడ యూత్ గణేష్ మండపం వద్ద శనివారం కుంకుమార్చన పూజలు అంగరంగ వైభవంగా జరిగినాయి. ఈ కార్యక్రమానికి గ్రామములోని మహిళలు అందరూ మంగళహారతులతో వచ్చి కుంకుమార్చన పూజలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. అనంతరం శ్రీ కోకీసా దేవేందర్ గౌడ్ సునీత మా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినారు. గ్రామంలోని భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు.