TG: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాష్ట్రంలోని రానున్న రెండు రోజుల పాటు పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.