భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు సిగ్గుచేటని వేములవాడ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాత నవీన్ అన్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలంటే డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలు సిగ్గుచేటని పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్రపటాలను చేతబూని భారత రాజ్యాంగం వర్ధిల్లాలి అంటూ నినాదం చేశారు.