రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం భక్తులు రద్దీ నెలకొంది. హరిహరులకు ఇష్టమైన మాసం కావడంతో కార్తీకదీపాలు వెలిగించి స్వామివారి సేవలో తరిస్తున్నారు. దర్శనానికి 4గంటల సమయం పడుతుంది. ముందుగా ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి అందరిని చల్లగా చూడు స్వామి అంటూ భక్తులు వేడుకున్నారు. కోడె మొక్కులతో పాటు తలనీలాలు సమర్పించుకొని తమ ఇండ్లకు భక్తులు బయలుదేరారు.