బాబు వైద్యం కోసం మన చారిటబుల్ ఆర్ధిక సహాయం

82చూసినవారు
బాబు వైద్యం కోసం మన చారిటబుల్ ఆర్ధిక సహాయం
వేములవాడ పట్టణంలోని శ్రీసరస్వతి శిశుమందిర్ లో అనుకోకుండా ఒకటవ తరగతి చదువుతున్న విధ్యార్థి దుద్దేటి రితిక్ (జయవరం గ్రామం)సాయంత్రం ఆడుకుంటుండగా జారి పడిపోయాడు. దీంతో చేతి ఎముక విరిగింది బాబుని హాస్పిటల్ తీసుకువెళ్తే డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నారు. మానవత్వంతో 30వేల రూపాయలైన బిల్లు 15 వేలకు డాక్టర్ మహేష్ రావు తగ్గించారు. మన చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి అండగా నిలిచారు.

సంబంధిత పోస్ట్