మార్కెట్ యార్డ్ నిర్మాణం కోసం స్థల పరిశీలన
వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో మార్కెట్ యార్డ్ కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలసి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్థల పరిశీలన చేశారు. రైతు ఆమోదయోగ్యమైన అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని చెప్పారు.