యాదాద్రి తరహాలో వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆలయ అభివృద్ధి పై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని, భక్తుల సౌకర్యార్థం అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. ఆలయానికి బంగారు తాపడం, వెండితో బయట పల్లకి ఉత్సవమూర్తుల తయారీకి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రాజన్న సన్నిధిలో మంత్రి మనవడి పుట్టి వెంట్రుకల కార్యక్రమం పూర్తి చేశారు.