రోడ్డుపై నిరాశగా కార్తీక్.. నచ్చజెప్పిన దీప

18585చూసినవారు
రోడ్డుపై నిరాశగా కార్తీక్.. నచ్చజెప్పిన దీప
గత ఎపిసోడ్‌లో డబ్బు చెల్లించకపోతే హిమని కానీ సౌర్యని కానీ రుద్రాణి తీసుకునిపోతుందని కార్తీక్ దీపతో చెబుతాడు. దాంతో దీప ఏడుస్తుంది. చివరికి బాధని దిగమింగి కార్తీక్ కి ధైర్యం చెబుతుంది. 1243వ ఎపిసోడ్‌ లో ఆనందరావు హెల్త్ చెక్ చేసిన డాక్టర్ భారతి ‘ఆంటీ అంకుల్ ఇలానే ఉంటే ప్రమాదం. డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు.. మీరు ఓ పని చేయండి ఆంటీ’ అంటూ ఏదో సలహా ఇస్తుంది. అంతా విన్న సౌందర్య.. ‘సరే ట్రై చేస్తాను భారతి’ అంటుంది.

సీన్ కట్ చేస్తే.. కార్తీక్ దీప తయారు చేసిన పిండి వంటలను ప్యాకింగ్ చేస్తూ ఉంటాడు. అది చూసి దీప ‘ఇలాంటి చిన్న చిన్న పనులు రాజు చేయకూడదు’ అంటూ కార్తీక్‌ని పొగుడుతుంది. ఇంతలో పిల్లలు స్కూల్‌కి వెళ్తూ ఈరోజైనా భోజనం తెస్తావా లేదా? అని దీపను అడుగుతారు. ‘తెస్తానమ్మా’ అని దీప చెబుతుంది.

కార్తీక్ జరిగింది అంతా తలుచుకుంటూ నిరాశగా రోడ్లపై వెళ్తూ ఉంటాడు. దీప ఏడవడం గుర్తొచ్చి.. ‘ఆ...ఆ..’ అని తలకొట్టుకుంటూ పిచ్చివాడిలా ప్రవర్తిస్తాడు. దీప కొన్ని డైలాగ్స్‌తో కార్తీక్‌కి నచ్చజెబుతుంది. మరోవైపు ఆ బ్యాగ్‌లోంచి ఒక లంచ్ బాక్స్ కార్తీక్ చేతికి ఇచ్చి.. ‘ఇది పిల్లలకు ఇచ్చేసి ఇంటికి వెళ్లండి.. వీటిని అమ్మేసి నేను వస్తాను’ అంటూ కార్తీక్‌ని పంపిస్తుంది. దీప అన్ని చోట్ల తిరుగుతూ జంతికలు అమ్మే ప్రయత్నం చేస్తుంది కానీ.. ఎవ్వరూ కొనరు.

కార్తీక్ లంచ్ బాక్స్ తీసుకుని స్కూల్‌కి వెళ్తాడు. పిల్లలు పరుగున వస్తారు. ఓ పిల్ల పరుగున వచ్చి కార్తీక్‌ని గుద్దేసి వెళ్లిపోతుంది. క్యారేజ్ కింద పడి మొత్తం అన్నం నేలపాలు అవుతుంది. ‘నాన్నా.. నీ వల్లేం కాదులే.. నీ తప్పు లేదులే.. అయినా మాకంత ఆకలి కూడా లేదులే’ అని అంటారు. మళ్లీ అన్నం తెస్తానంటూ కార్తీక్ వెళ్లిపోతాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్