ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో కీలక ఆధారాలు

75చూసినవారు
ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో కీలక ఆధారాలు
ఏపీ విశాఖ జిల్లాలో ఎమ్మార్వో రమణయ్య హత్య కేసు సంచలనం సృష్టిస్తోంది. ఎమ్మార్వో ఇంటికి వెళ్లి ఓ ఆగంతకుడు రాడ్‌తో కొట్టి చంపేశాడు. ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఆగంతకుడు మాస్కు పెట్టుకుని రమణయ్య ఇంటికి వచ్చాడు. నిందితుడు ఎమ్మార్వోతో ఘర్షణ పడేకంటే ముందు మరో ఇద్దరు మాట్లాడి వెళ్లారు. ఆ ఇద్దరు వ్యక్తుల కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. హత్య వెనుక ఆ ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్