నేడు కాంగ్రెస్‌లో చేరనున్న బీఆర్ఎస్‌ కీలక నేతలు?

1072చూసినవారు
నేడు కాంగ్రెస్‌లో చేరనున్న బీఆర్ఎస్‌ కీలక నేతలు?
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగలనుంది. ఆ పార్టీ ముఖ్య నేతల కుటుంబాలు బీఆర్ఎస్‌ను వీడనున్నాయి. వారిలో పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు అనితా రెడ్డి, ప్రస్తుత డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు ఉన్నట్లు తెలుస్తోంది. నేడు గాంధీ భవన్‌లో వీరికి దీపా దాస్ మున్షి హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్