లాకప్ డెత్ కేసులో కీలక ట్విస్ట్

54చూసినవారు
లాకప్ డెత్ కేసులో కీలక ట్విస్ట్
TG: నిజామాబాద్ పీఎస్ లో సంపత్ అనే రిమాండ్ ఖైదీ అనుమానస్పద మృతి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సంపత్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా ఆ రిపోర్టును సీపీ సాయి చైతన్యకు అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంపత్ గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారని తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టులో ఇదే తేలిందని చెప్పుకొచ్చారు. అలాగే సంపత్ ఆస్పత్రికి వెళ్లడం సీసీ టీవీల్లో రికార్డు అయిందని, అతను ఆస్పత్రిలో కుప్పకూలడంతో డాక్టర్లు సీపీఆర్ చేశారని సీపీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్