ఆదిలాబాద్ జిల్లాలో ఆదీవాసీలు హోళీ పండుగను అందరికన్నా భిన్నంగా జరుపుకుంటారు. ఉట్నూర్ మండలంలోని మత్తడిగూడ గ్రామస్తులు హోళీని దురాడి-దులండిగా జరుపుకుంటారు. మోదుగ పూలతో స్వచ్ఛమైన రంగులు తయారుచేసి, గ్రామస్తులందరికీ కొబ్బరి కుడుకలు ఇచ్చి, పుల్లారా (త్రాసు లాగా ఉంటుంది) తయారుచేసి పూజలు నిర్వహిస్తారు. కాముని దహనం చేసిన మంటల్లో దూకుతారు. ఇలా మంటల్లో దూకడం వల్ల కీడు ఏదైనా ఉంటే వెళ్ళిపోతుందని వారి నమ్మకం.