తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీ దామోదర్ పోలీసుల కాల్పుల్లో మృతిచెందారు. ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయన మృతిచెందినట్లు మావోయిస్టు పార్టీ ఓ లేఖను విడుదల చేసింది. దామోదర్ స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి. దాదాపు 30 ఏళ్లుగా ఆయన మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా ఆయన పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. ఆయనపై ఛత్తీస్‌గఢ్‌లో50 లక్షల రివార్డు కూడా ఉంది.