వ్యవసాయ క్షేత్రంలో మంత్రి పొంగులేటి
కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాసేపు సేద తీరారు. ఈ సందర్భంగా వ్యవసాయ క్షేత్రంలో సాగవుతున్న పంటలను పరిశీలించారు. పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ క్షేత్రంలో ఉన్నంతసేపు మనసు ఆహ్లాదకరంగా ఉంటుందని మంత్రి తెలిపారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయన సత్తుపల్లి మండలంలో నేడు పర్యటించనున్నారు.