ఖమ్మం నగరంలో ఎన్. ఎస్. ఎస్ అధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో గీతాంజలి డిగ్రీ కళాశాల విద్యార్థులు క్విజ్ మరియు రంగోలి పోటీల్లో ప్రతిభ కనబరిచారు. గీతాంజలి డిగ్రీ కళాశాల విద్యార్థులు మొత్తం ఏడు విభాగాల్లో పాల్గొనగా రంగోలి నందు చిద్విలా దేవి మొదటి స్థానం క్విజ్ నందు సిందు, అమీనా, ప్రియాంక రెండవ స్థానం కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం విద్యార్థులను అభినందించారు. కళాశాల డైరెక్టర్ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ పోటీల్లో గెలుపు ఓటములు సహజమని విద్యార్థి దశ నుండే చురుకుగా అన్ని పోటీల్లో తమ ప్రతిభను పరీక్షించుకుని కష్టపడి ప్రయత్నిస్తే ఏదో ఒక రోజు విజయం సాధిస్తారని అన్నారు. అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గువ్వల తిరుమల రెడ్డి, ఎన్. ఎస్. ఎస్ పిఓ కోడిరెక్క ఉమా శంకర్, కల్పన అధ్యాపకులు శాంతకుమార్, ఉపేందర్, శ్రీనివాస్, శివాజీ, గోపిరెడ్డి, విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు.