నిరుపేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తాం

78చూసినవారు
నిరుపేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తాం
ఖమ్మంలో రోడ్ల వెంట, కాల్వగట్ల వెంట గుడిసెలు వేసుకుని ఉంటున్న వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. శుక్రవారం ఖమ్మంలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడారు. వెంకటగిరి, బైపాస్ బ్రిడ్జిలు, దానవాయిగూడెం ఫిల్టర్ బెడ్, పుట్టకోట బెడ్ తన హయాంలో నిర్మించినవేనని తెలిపారు. ఖమ్మం ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉండాలంటే రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.

సంబంధిత పోస్ట్