పాల్వంచ రూరల్ లోని కేటీపీఎస్ లో 9వ యూనిట్ ట్రిప్ కావడంతో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. 5వ దశలో 250 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 9వ యూనిట్ లో బాయిలర్ ట్యూబ్ లీక్ అవడంతో సాంకేతిక లోపం తలెత్తి విద్యుత్ ఉత్పత్తి నిలిచి పోయింది అని, మరమ్మత్తులు చేపట్టామని బుధవారం ఉత్పత్తి పునరుద్ధరిస్తామని చీఫ్ ఇంజనీర్ ప్రభాకర్ తెలిపారు.