TG: మీర్‌పేట్ మాధవి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో మాధవి DNA రిపోర్టును పోలీసులకు అందజేశారు ఫోరెన్సిక్ అధికారులు. భర్త గురుమూర్తి భార్య మాధవిని హత్య చేసి.. ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా డెడ్ బాడీని కాల్చి పొడి చేశారు. అనంతరం దానిని చెరువులో కలిపారు. అయితే గురుమూర్తి ఉపయోగించిన టిష్యూలు ఈ కేసులో కీలకంగా మారాయి. వాటి ఆదారంగా DNA పరీక్షలు చేశారు అధికారులు.