AP: కృష్ణా జిల్లా పామర్రు మండలం కొండాయపాలెం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది. దాంతో లారీ ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను స్థానికులు కాపాడి మచిలీపట్నం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.