AP: వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో మొదటిసారిగా ఒక్క మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టనున్నారు. సిలబస్, ప్రశ్నాపత్రాల నమూనాలోనూ ఇంటర్మీడియట్ విద్యామండలి మార్పులు చేసింది. ఇప్పటివరకు గణితం ఏ, బీ పేపర్లుగా 75 మార్కుల చొప్పున 150 మార్కులకు ఉండగా.. ఇక నుంచి పబ్లిక్ పరీక్షల్లో రెండూ కలిపి ఒక్క పేపర్‌గానే ఉంటుంది. మార్కులను సైతం వందకు కుదించారు.