మధిర మండలం సిరిపురం ఎస్బీఐ బ్రాంచ్లో రాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి యత్నించినట్లు వైరా ఏసీపీ రెహమాన్ తెలిపారు. శుక్రవారం ఉదయం బ్యాంకుకు వచ్చిన బ్యాంక్ మేనేజర్ ఉమేశ్ కుమార్ యాదవ్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ క్లూస్ టీమ్ ని రప్పించి దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎటువంటి నగదు, ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించలేదని పేర్కొన్నారు.