ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని పలు ప్రాంతాలలో మంగళవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పర్యటించారు. ముందుగా మండల, పట్టణ బిజెపి నాయకులతో సమావేశమై పలు గ్రామాలలో ప్రజా సమస్యలను గురించి స్థానిక బిజెపి నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.