గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క బోనకల్ మండలంలో బీటీ రోడ్ల నిర్మాణానికి 19. 70కోట్ల రూపాయిల నిధులను కేటాయిస్తూ జీఓ జారీ చేయడంతో మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేయడం పట్ల పీసీసీ సభ్యుడు పైడిపల్లి కిషోర్, జిల్లా కార్యదర్శి బందం నాగేశ్వరరావు, మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు, సొసైటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరావు, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.