బీఆర్ఎస్ చింతకాని మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యను అరెస్ట్ చేయటం రాజకీయ ప్రేరేపిత చర్యగా ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అయ్యప్ప దీక్షలో ఉన్న పుల్లయ్యను టెర్రరిస్టు మాదిరిగా అరెస్ట్ చేశారని, ఈ క్రమంలో మహిళలతో అనుచితంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు.