ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శుక్రవారం ఆలయ అర్చకులు శ్రీనివాస్ శేషాచార్యులు ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధిర పట్టణంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా ఆలయ నిర్వహకులు అమ్మవారి పసుపు, కుంకుమలను వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.