ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని చిలుకూరు గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ నిడమనూరు సంధ్య ఆధ్వర్యంలో శనివారం ఘనంగా 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ నిడమానూరు సంధ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.