గురుకుల విద్యాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నాగుర్ వలి అన్నారు. బుధవారం మధిర పట్టణంలో డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయ సిబ్బందికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల మెస్ ఛార్జీల పెంపు, గురుకులాల్లో తగిన మరుగుదొడ్ల నిర్మాణం, ఉపాధ్యాయులకు ప్రమోషన్లు వంటివి చేపట్టాలని పేర్కొన్నారు. అన్ని సొసైటీలను కలిపి కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని కోరారు.