ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిధి అధ్యాపకుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శాస్త్రీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో మాథ్స్, ఇంగ్లీష్, తెలుగు సబ్జెక్టులలో అతిధి అధ్యాపకులకు అర్హులైన అభ్యర్థులు 5వ తేదీ లోపు కళాశాలలో తమ దరఖాస్తులను అందజేయాలని తెలియజేశారు.