మధిర పట్టణంలోని షాదీఖానా నందు మంగళవారం 13, 14 వార్డులకు సంబంధించి ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లతా పాల్గొని మాట్లాడుతూ. ప్రభుత్వం అందించే పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 13 వ వార్డు కౌన్సిలర్ అనిత తదితరులు పాల్గొన్నారు.