గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం రూరల్ మండలం వరద ముంపుకు గురైంది. సోమవారం సీపీఐ జాతీయ సమితి సభ్యుడు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సహాయ కార్యదర్శి దండి సురేష్ తదితర సీపీఐ శ్రేణులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మౌలానా అన్నారు. నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.