నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ (2జే) ప్రకారం రికార్డు తనిఖీలకు ఆర్టీఐ యాక్టివ్ మెంబర్ పసుమర్తి శ్రీనివాస్ దరఖాస్తు చేశారు. కాగా, ఎస్ఐ సంతోశ్ అనుమతించడంతో గురువారం రికార్డులను తనిఖీ చేసినట్లు తెలిపారు. రిసెప్షన్ బుక్, ఎఫ్ఐఆర్ ఇండెక్స్, జీడి ఎంట్రీ, చార్జిషీట్ బుక్, కేసు డైరీలు, క్యాష్ బుక్ ఫైనల్ రిపోర్ట్ పరిశీలించారు. తనిఖీలకు ఎస్ఐ సహకరించారని వెల్లడించారు.