కూసుమంచి మండలం ముత్యాలగూడెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తాటికొండ రామారావు (45) అనే రైతు బుధవారం విద్యుత్ షాక్ కు గురై మృతి చెందారు. వ్యవసాయ పనుల నిమిత్తం తన పొలానికి వెళ్లిన రామారావు విద్యుత్ షాక్ తో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.