ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టులో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రజలకు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపిక ప్రాసెస్ జరుగుతుందని, తప్పనిసరిగా అందజేస్తామన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మువ్వా విజయబాబు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన హజరయ్యారు.