ఖమ్మం జిల్లా పాలేరులో నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి అన్వేష్ చింతల ఆదేశాల మేరకు, అకౌంట్స్ అండ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ కమర్తపు భానుచందర్ ప్రోత్సాహంతో ఇంజనీరింగ్ కళాశాలలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం నిర్వహించారు. కళాశాల విద్యార్థులు,ఇతరులు 16 రోజుల పాటు జరిగిన ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ర్యాలీ, ప్లెడ్జ్ టేకింగ్, దేవాలయాల పరిశుభ్రత, డార్క్ స్పాట్స్ పై జనాలలో అవగాహన వంటి కార్యక్రమాలను నిర్వహించారు.