కూసుమంచి మండలం పాలేరు ఎన్ఎస్పీ పెద్ద కాల్వకు ఇటీవల వచ్చిన వరదలకు ఏర్పడ్డ గండ్లు త్వరితగతిన పూర్తి చేశామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్ఎస్పీ కాలువకు నీటి విడుదల చేసినట్లు చెప్పారు. ఎన్ఎస్పీ కాలువకు సాగునీటి కోసం నీటిని విడుదల చేయడం పట్ల ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.