కరోనా బారిన పడి ఖమ్మం లోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యు.పి.యస్ లచ్చన్న గూడెం ప్రధానోపాధ్యాయులు సుజాత మృతిచెందారు. వారి మృతదేహానికి టియస్ యూటియఫ్ వేంసూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు మేకల. ధర్మారావు, ప్రధాన కార్యదర్శి బి. ఈశ్వరా చారి, జిల్లా కార్యదర్శి జియస్ఆర్ రమేష్, నాయకులు జి. చంద్రశేఖర్, కృష్ణారావు కార్యదర్శి టి. రామశేషు తదితరులు పాల్గొన్నారు.