సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మెన్‌గా దోమ ఆనంద్ బాబు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సమక్షంలో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు రుణం విముక్తి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15వ తేదీన రుణమాఫీ అమలు చేయనున్నట్లు చెప్పారు. చిత్తశుద్ధితో తమ ప్రభుత్వం పని చేస్తుందని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పథకాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు.